“Virgin Story” will appeal to young audiences – Producer Lagadapati Sridhar

యువ ప్రేక్షకులకు నచ్చేలా “వర్జిన్ స్టోరి” ఉంటుంది – నిర్మాత లగడపాటి శ్రీధర్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా “వర్జిన్ స్టోరి”. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. “వర్జిన్ స్టోరి” సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ప్రెస్ మీట్ లో తెలియజేశారు యూనిట్.

హీరో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ…టీనేజ్ ను టార్గెట్ చేస్తూ హాలీవుడ్లో కొన్ని ప్రత్యేక చిత్రాలు వస్తుంటాయి. మన దగ్గర అలా లేదు. వర్జిన్ స్టోరీ టీనేజ్ వారికి నచ్చే సినిమా అవుతుంది అన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ…యువత కోణంలో సాగే చిత్రమిది. వాళ్ల ఆలోచనలకు ప్రతిబింబంలా ఉంటుంది. 16 ఏళ్లకు అమ్మాయి, అబ్బాయి కొత్తగా రెక్కలొచ్చినట్లు ఫీలవుతారు. యువత లైఫ్ లో రొమాన్స్ ఉండాలి. లేకుంటే చాలా మెమొరీస్ కోల్పోతారు. థర్డ్ వేవ్ తర్వాత మళ్లీ సినిమాలకు మంచి రోజులు వచ్చాయి. తాజాగా డిజె టిల్లు ఇతర సినిమాలకు కలెక్షన్స్ బాగుంటున్నాయి. వాలెంటైన్స్ వీక్ లో మా సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నెల18న థియేటర్ లలో చూడండి అన్నారు.

నిర్మాత లగడపాటి శిరీష మాట్లాడుతూ…నేటి యువతరం సినిమా ఇది. వాళ్ల ధైర్యం, భావోద్వేగాలను చూపిస్తున్నాం. కొన్నేళ్లుగా మా సంస్థ అభిరుచి గల సినిమాలు నిర్మిస్తోంది. వర్జిన్ స్టోరితో మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడం గర్వంగా ఉంది. అన్నారు.

దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ…నేటి యువతకు అన్నీ వేగంగా జరగాలి. ఫుడ్ కావాలంటే నిమిషాల్లో తెప్పించుకుంటారు. ఇష్టమైన వ్యక్తులను పొందడంలో కూడా అదే వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమకు, కోరుకున్న కెరీర్ కు మీరు సమయం ఇవ్వాల్సిందే. లేకుంటే అవి దక్కవు. ప్రేమకు అసలైన పరీక్ష ఏంటో చెప్పే సినిమా ఇది. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు పాల్గొని సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి
తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం – అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్ – గ్యారీ,
సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాఘవేంద్ర,
నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *