Vikram Sahidev’s Debut Movie “Virgin Story” Trailer Impressed With Youthful Elements. The movie will be released on the 18th of this month

యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో ఇంప్రెస్ చేసిన లగడపాటి విక్రమ్ సహిదేవ్ డెబ్యూ మూవీ “వర్జిన్ స్టోరి” ట్రైలర్. ఈ నెల 18న సినిమా రిలీజ్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా “వర్జిన్ స్టోరి”. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. “వర్జిన్ స్టోరి” సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో ఉన్న ట్రైలర్ ఇంప్రెస్ చేస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఒక ఫ్రెష్ లవ్ ఎంటర్ టైనర్ ను తెరపై చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతోంది.

నువు ఒకేసారి ఇద్దర్ని లవ్ చేస్తున్నావని అనుకుంటే ఆ రెండో పర్సన్ నే ఎంచుకో. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ని నిజంగా లవ్ చేసి ఉంటే ఆ రెండో పర్సన్ ఉండే ఛాన్సే లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పబ్ లో హీరోను చూసి నాయిక ఇంప్రెస్ అవడం ఆ తర్వాత వాళ్ల లవ్ జర్నీని చూపించారు. చిన్న చిన్న అపార్థాలతో ఈ జంట విడిపోవడం, ఆ ఎడబాటుతో బాధపడటం ట్రైలర్ లో ఉంది. మనల్ని అబ్బాయిలు నెంబర్స్ లా చూస్తారు కానీ మనం నెంబర్స్ కాదని చెప్పే టైమ్ వచ్చింది అనే డైలాగ్స్ అమ్మాయిల వెర్షన్ చూపిస్తున్నాయి. చివరలో వచ్చిన సీన్ కంప్లీట్ యూత్ ఫుల్ గా ఉంది. ఇవన్నీ సినిమాలో రొమాంటిక్ గా, హిలేరియస్ గా ఉంటాయని తెలుస్తోంది.

విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి
తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి

సంగీతం – అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్ – గ్యారీ,
సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాఘవేంద్ర,
నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *