Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 Releasing On May 27th

మే 27న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎఫ్ 3’.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ `ఎఫ్‌3` ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించనుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాస్త ఆల‌స్యంగా మే27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా  ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు పాట విడుద‌లై విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుంది.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ ,రాజేంద్ర ప్రసాద్, సునీల్ తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్: అనిల్ రావిపూడి

సమర్పణ: దిల్ రాజు

నిర్మాత: శిరీష్

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి

సంగీత : దేవీ శ్రీ ప్రసాద్

కెమెరామెన్: సాయి శ్రీరామ్

ఆర్ట్: ఏఎస్ ప్రకాష్

ఎడిటింగ్: తమ్మిరాజు

స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ

అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *