Monday, April 15, 2024
spot_img

MANMADHA LEELA Poster Released.

MANMADHA LEELA Poster Released.

వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న `మ‌న్మ‌థ‌లీల` పోస్ట‌ర్ విడుద‌లైంది

చెన్నై 28, ది లూప్‌, మ‌న‌క‌థ` చిత్రాల ఫేమ్ వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ద్విబాషా చిత్రం రూపొందుతోంది.  తమిళం)లొ మన్మథలీలై, తెలుగులో మన్మదలీల పేరును ఖ‌రారు చేశారు. ఈ చిత్రం  ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారంనాడు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ చిత్రం వెంక‌ట్ ప్ర‌భుకు 10వ చిత్రం కావడం విశేషం. అందుకే `వెంకట్ ప్రభు క్వికీ` అనే టాగ్ పెట్టారు. తమిళ నటుడు ‘పిజ్జా 2’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తుండ‌గా ఆయ‌న స‌ర‌స‌న  సంయుక్త హెగ్డే, స్మ్రుతి వెంకట్, రియా సుమన్ నాయిక‌లుగా నటిస్తున్నారు. గ‌తంలో క‌మ‌ల్‌హాస‌న్‌, శింబు చిత్రాల‌కు ఇదేపేరుతో స‌క్సెస్ సాధించారు. ఇప్పుడు మ‌రోసారి మ‌న్మ‌థ‌లీల పేరుతో వెంక‌ట్ ప్ర‌భు చేయ‌డం విశేషం. ఈ తాజా సినిమాను రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై టి.మురుగానందం నిర్మిస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

న‌టీన‌టులుః అశోక్ సెల్వన్, సంయుక్త హెగ్డే, స్మ్రుతి వెంకట్, రియా సుమన్ త‌దిత‌రులు.

సాంకేతిక సిబ్బందిః దర్శకుడు – వెంకట్ ప్రభు, కెమెరాః  తమిళ్ ఎ అజగన్, సంగీతం – ప్రేమి అమరెన్,
ఎడిటర్ – వెంకట్ రాజన్, కళ – ఉమేష్ జె కుమార్, నిర్మాత- టి.మురుగానందం, నిర్మాణ సంస్థ – రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.

READ IN ENGLISH

Related Articles

- Advertisement -spot_img

Latest Articles