Upcoming “ANT Love Story” suspense, thriller, horror movie

సస్పెన్సు, థ్రిల్లర్, హర్రర్ మూవీగా రాబోతున్న “ANT Love Story”

లక్కీ రాథోడ్, tholi మమేడి  ఆర్. కె. చారి, రింకల్ లియువా, రీతూ కాన్వత్, అనిందితా దాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను ఎ.వి. ఆర్. ఇంటర్నేషనల్ బ్యానర్ పై “ANT Love Story” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తొలి మమేది ఆర్. కె. చారి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : నజీర్. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రామానాయుడు స్టూడియోలో లాంచ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ సందర్బంగా దర్శకుడు నజీర్ మాట్లాడుతూ.. “సస్పెన్సు, థ్రిల్లర్, హర్రర్ మూవీ గా మా సినిమా తెరకెక్కుతోంది. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. మీకు టైటిల్ చూడగానే డౌట్ వచ్చి ఉంటది.. టైటిల్ కి తగ్గట్టుగానే మా సినిమా కథ కూడా ఉంటది. దానికి తగ్గట్టుగా మా నిర్మాత కూడా ఎక్కడ ఖర్చుకు వెనుకాడకుండా మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి అవకాశం కల్పించిన నిర్మాతకి కృతఙ్ఞతలు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తొలి మమేది ఆర్. కె. చారి మాట్లాడుతూ… “ఈ సినిమా కథను దర్శకుడు చెప్పినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా అని చాలా ఆతృతగా ఉన్నాము. మా దర్శకుడు కూడా ఈ సినిమాను మాకు చెప్పిన విధంగానే తెరకెక్కిస్తున్నారు. మంచి సబ్జెక్టు మా దర్శకుడితో మంచి టాలెంట్ ఉంది. ఇక నటీ నటులు కూడా చాలా బాగా నటిస్తున్నారు. మా సినిమాని అందరూ చెప్పుకునే విధంగా తెరకెక్కిస్తాం” అని అన్నారు. 

నటీ నటులు :  లక్కీ రాథోడ్, తొలి మమేది ఆర్. కె. చారి, రింకల్ లియువా, రీతూ కాన్వత్, అనిందితా దాస్ తదితరులు 

వి.ఎఫ్.ఎక్స్. : వనజాస్ ద డిజిటల్ సినిమా సొల్యూషన్, అసిస్టెంట్ డైరెక్టర్ : సమీర్ ఖాన్, ఎడిటింగ్ : వీరు, మ్యూజిక్ : సుకుమార్, డి.ఒ.పి. : పి.ఆర్.చంద్ర రావు, ప్రొడక్షన్ హెడ్ : మనోజ్ కుమార్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తొలి మమేడి ఆర్. కె. చారి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : నజీర్.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *