Thaman S released the song sung by Shanmukha Priya from the movie Grey

గ్రే చిత్రం నుండి ఇండియ‌న్ ఐడ‌ల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాట విడుద‌ల చేసిన ఎస్ త‌మ‌న్

ఈ వాలెంటైన్స్ డే మూడ్‌ను కొన‌సాగించ‌డానికి `గ్రే(GREY)` చిత్ర బృందం ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాట‌ను రిలీజ్‌ చేసింది. నాగరాజు తాళ్లూరి ఈ పాట‌ను స్వరపరిచారు. ఈ పాటను సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ రోజు ఉదయం 10.10గంటలకు విడుద‌ల చేశారు.

రాజ్ మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అద్వితీయ మూవీస్ నిర్మించింది. అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలలో నటించారు.

గ్రే అనేది బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన సినిమా అనే వాస్తవాన్ని నిజం చేసేందుకు టీమ్ అన్ని ప్రమోషన్‌ల కోసం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఎంచుకుంది. 4 దశాబ్దాల తర్వాత రూపొందుతున్న తొలి బ్లాక్ అండ్ వైట్ సినిమా గ్రే.

ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ పాట పాడిన‌ మొదటి చిత్రం ఇది.

గ్రే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేక అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉన్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము అని నిర్మాత‌లు తెలిపారు.

నటీన‌టులు
ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్‌, రాజ్ మ‌దిరాజు, షాని సాల్మోన్‌, న‌జియా, సిద్ధార్థ్‌

సాంకేతిక నిపుణులు
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  రాజ్‌ మ‌దిరాజు
నిర్మాత: కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి
స‌హ నిర్మాత: రాజేష్ తోరేటి, రాజా వ‌శిష్ట‌, శ్రీదేవి కాళ్లకూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఉమామ‌హేశ్వ‌ర్ చ‌ద‌ల‌వాడ‌
సినిమాటోగ్రాఫ‌ర్: ఎమ్ ఆర్ చేత‌న్ కుమార్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్ నాయ‌ర్‌
మ్యూజిక్: నాగ‌రాజు తాల్లూరి
ఎడిట‌ర్: స‌త్య గిదుటూరి
మేక‌ప్:  విమ‌లా రెడ్డి
యాక్ష‌న్: వింగ్ చున్‌ అంజి
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సంజ‌య్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: హేమంత్ సిరి
పీఆర్వో: శ్రీను- సిద్ధు

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *