Taman unveils ‘C’ studio logo

‘సి’ స్టూడియో లోగో ఆవిష్కరించిన తమన్

దివంగత మ్యూజిక్​ డైరెక్టర్​ చక్రి తమ్ముడు మహిత్​ నారాయణ్​ నెలకొల్పబోతున్న ‘సి–స్టూడియోస్​ (ద సోల్​ఫుల్​ మ్యూజిక్​ అడ్డ)’ లోగోను ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమన్​.. చక్రితో కలిసి జర్నీ చేసిన రోజులను  గుర్తుచేసుకున్నారు. ‘‘చక్రిగారి వద్దకు మేము వర్క్​ చేయడానికి డబ్బు కోసం కాదు.. ఆయన ప్రేమ కోసం వచ్చేవాళ్లం.. చక్రిగారి తమ్ముడు మహిత్​నారాయణ్​ మంచి మ్యూజిక్​ డైరెక్టర్​గా రాణించాలని కోరుకుంటున్నాను.  చక్రి పేరు మీద వస్తున్న సి–స్టూడియో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు. ఓ బ్రదర్​గా మహిత్ నారాయణ్​​కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. స్టూడియోను అందరూ ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  లోగో ట్యాగ్​ లైన్​ ‘సోల్​ ఫుల్​ మ్యూజిక్​ అడ్డ’ తనను ఎంతో ఆకట్టుకున్నదని, చక్రి కూడా అందరితో సోల్​ఫుల్​గా, ఆత్మీయంగా ఉండేవారని తెలిపారు. మహిత్​ నారాయణ్​ మాట్లాడుతూ.. టైం ఇచ్చి లోగోను  ఆవిష్కరించినందుకు తమన్​ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. త్వరలోనే హైదరాబాద్​ శ్రీనగర్​ కాలనీలో స్టూడియో ప్రారంభం కాబుతున్నదన్నారు. అన్నయ్య చక్రి ఆశీస్సులతోపాటు, అందరి ఆశీస్సులు తనకు కావాలని ఆయన కోరారు. స్టూడియో పేరులోని ‘సి’లో రెండు ‘సి’లు ఉన్నాయని, ఇందులో ఒకటి అన్నయ్య చక్రి పేరు, రెండోది మెగాస్టార్​ చిరంజీవి పేరు అని, వారిద్దరూ తనకు ఆదర్శమని వివరించారు.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *