Taapsee Pannu, Matinee Entertainment’s Mishan Impossible Releasing On April 1st

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తాప్సీ పన్ను నటించిన మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1న విడుదల

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అనేక ప్రాజెక్టులను చేపట్టింది. స్టార్స్ తో హై బడ్జెట్ ఎంటర్ టైనర్స్ చేయడమే కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలను కూడా తీస్తోంది. మిషన్ ఇంపాజిబుల్లో తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తుండగా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ప్రతిభావంతులైన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం  సంగీత ప్రమోషన్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి, ఇటీవలే చిత్ర బృందం  `ఏద్దాం గాలం`  అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది, దీనికి సంగీత ప్రియుల నుండి మంచి స్పందన వచ్చింది. సోమవారం నాడు సినిమా రిలీజ్ డేట్కి సంబంధించిన అప్డేట్ను అందజేసారు.

వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి `మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్` 1న థియేటర్లలోకి రానుంది. తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో  ప్రేక్షకులను మైమరిపించే  చిత్రంగా రూపొందింది.

నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా, సంగీతం: మార్క్ కె రాబిన్. ఎడిటర్ రవితేజ గిరిజాల.

తారాగణం: తాప్సీ పన్ను, రవీందర్ విజయ్, హరీష్ పరేది తదితరులు,

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్
రచయిత మరియు దర్శకుడు: స్వరూప్ RSJ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాత: N M పాషా
సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర
PRO: వంశీ శేఖర్

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *