Sreeleela’s First Look As Pranavi From Ravi Teja, Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ Dhamaka Revealed

ర‌వితేజ‌, త్రినాథరావు నక్కిన, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ‘ధమాకా’ చిత్రంలో ప్రణవి గా శ్రీ‌లీల ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌.

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కినల‌ ఫ‌స్ట్ క్రేజీ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వాలెంటైన్స్ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ప్రేమికుల రోజు కావడంతో రవితేజ, శ్రీలీల జంటగా ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల క్యూట్‌గా కనిపిస్తోంది. వారిద్ద‌రి మ‌ధ్య‌ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల పాత్ర పేరు ప్రణవి.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

ధ‌మాక ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌య్యింది

నటీనటులు: రవితేజ, శ్రీలీల

సాంకేతిక బృందం

దర్శకుడు: త్రినాథరావు నక్కిన

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

స్టోరీ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ

సంగీతం: భీమ్స్ సిసిరిలియో

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *