Shiva Karthikeyan bilingual film directed by Anudeep

అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ద్విభాషా చిత్రం

శివ కార్తికేయన్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ నిర్మాణంలో దర్శకుడు అనుదీప్ కేవి తమిళ, తెలుగు ద్విభాష చిత్రం అనౌన్స్ మెంట్

విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు  కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. న్యూ ఇయర్ సందర్భంగా శివ కార్తికేయన్ తో తెలుగు తమిళ ద్విభాష చిత్రాన్ని అనౌన్స్ చేశారు నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, సురేష్ బాబు. శివ కార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.

జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు అనుదీప్ కేవి రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోకు మంచి ఫామ్ లో ఉన్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది.

యూకే లోని లండన్ మన దేశంలోని పాండిచ్చేరి నేపథ్యంగా కథ సాగనుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్న ఎస్కే 20 రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. త్వరలో నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

నటీనటులు – శివ కార్తికేయన్

సాంకేతిక నిపుణులు

రచన దర్శకత్వం – అనుదీప్ కేవి
సంగీతం – ఎస్ఎస్ థమన్
నిర్మాతలు – నారాయణ దాస్ నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, సురేష్ బాబు
సహ నిర్మాత – అరుణ్ విశ్వ
బ్యానర్స్ – సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్
పీఆర్వో – వంశీ శేఖర్

Read In English

Spread the love
AD
AD

One thought on “Shiva Karthikeyan bilingual film directed by Anudeep

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *