Shakalaka Shankar, Rajiv Kanakala and ShreeTej are the main characters DALARI title logo released

షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రదారులుగా ‘దళారి’ టైటిల్ లోగో విడుదల

ఎస్. కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దళారి’. షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ – ఎమోషనల్ యాక్షన్ డ్రామా టాకీ పార్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ వేడుకలో నటులు శ్రీ తేజ్, షకలక శంకర్, శ్రీ తేజ్, దర్శకుడు గోపాల్ రెడ్డి, నిర్మాతలు సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్. కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దళారి’ సినిమాను వేగవంతంగా పూర్తి చేసుకున్నాం. దానికి సహకరించిన నిర్మాతలు వెంకట్ రెడ్డి గారికి సురేష్ కొండేటి గారికి గుండె లోతుల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్ని విధాలుగా సహకరించిన శంకర్ గారు, శ్రీ తేజ్ గారు అలాగే మిగతా అందరు టెక్నీషియన్స్ సహా పూర్తి స్థాయిలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా వంతుగా ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశామని ఆయన అన్నారు.

షకలక శంకర్ మాట్లాడుతూ సురేష్ కొండేటి గారు వెంకట్ రెడ్డి గారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారని, దర్శకుడు గోపాల్ రెడ్డి అద్భుతంగా సినిమా తెరకెక్కించారు అని అన్నారు. నటుడు శ్రీ తేజ్ కూడా ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారని, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల సినిమా మొత్తానికి ఒక కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది అని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మరోసారి ముందుకు వస్తానని శంకర్ పేర్కొన్నారు.

నటుడు శ్రీతేజ్ మాట్లాడుతూ ఇప్పటికే టాకీ పార్ట్ అంతా పూర్తయిందని, డైరెక్షన్ పరంగా గోపాల్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తెరకెక్కించారని అన్నారు. స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అవసరమైతే రాత్రి దాటాక కూడా స్క్రీన్ ప్లే కరెక్షన్స్ చేసుకుంటూ చాలా పకడ్బందీగా షూటింగ్ చేశారని అన్నారు. ఇది ఒక సోషల్ కాజ్ తో ఉన్న అమేజింగ్ థ్రిల్లర్ అని శ్రీతేజ్ వెల్లడించారు. ఫస్ట్ కాపీ వచ్చాక మరోసారి మీ ముందుకు వస్తామని అన్నారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని వారికి ముందుగానే శుభాకాంక్షలు అని అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘శంభో శంకర’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మరోసారి షకలక శంకర్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు రాని పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అన్నారు. ఈ సినిమా కథ విన్నప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనిపించిందని ఆయన అన్నారు. అందుకే ఈ సినిమాలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేశానని అన్నారు. ఈ సినిమాకు తనతో పాటు నిర్మాతగా వ్యవహరించిన వెంకట్ రెడ్డి గారు మంచి అభిరుచి కలిగిన నిర్మాత అని, ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు కావాలని అన్నారు. రాజీవ్ కనకాల మరియు శ్రీ తేజ్ పాత్రలు కూడా ఈ సినిమాలో కీలకంగా ఉంటాయని శంకర్ శంభో శంకర కంటే ఈ సినిమా చూసిన తర్వాత మాస్ ఎలిమెంట్స్ సస్పెన్స్ యాక్షన్ అన్ని కలగలిపిన సినిమా అని సురేష్ కొండేటి పేర్కొన్నారు.

నిర్మాత ఎడవెల్లి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సురేష్ కొండేటి గారితో కలిసి సినిమా చేయడం శుభ పరిణామమని అన్నారు. శంకర్, రాజీవ్ కనకాల, శ్రీతేజ్, పృథ్వి, గారు జబర్దస్త్ ఆర్టిస్టులు, గబ్బర్ సింగ్ టీం ఇలా దాదాపు 40 మంది ఆర్టిస్టులతో ‘దళారి’ సినిమా చేయడం జరిగిందని అన్నారు. కంటెంట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశామని సినిమాను కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు. సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఓవర్ టైం పని చేసి సినిమా పూర్తి చేసేందుకు సహకరించారని వాళ్లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
నిర్మాతలు : సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకట్ రెడ్డి, బ్యానర్: ఎస్. కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్, సినిమాటోగ్రఫీ : మెంటెం సతీష్, ఎడిటింగ్ : నందమూరి హరి, సంగీతం : గౌరహరి, రచన, దర్శకత్వం :గోపాల్ రెడ్డి,

READ IN ENGLISH

Spread the love
AD
AD

One thought on “Shakalaka Shankar, Rajiv Kanakala and ShreeTej are the main characters DALARI title logo released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *