జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్జీవి “ఆశా”

శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా అకుల,  వెంకట్, శ్రీధర్, ముని,  నవీన్,  కళ్యాణ్,  ప్రవీణ్,  ప్రశాంతి నటీనటులుగా ఆనంద్ చంద్ర  రచన, దర్శకత్వంలో అనురాగ్ కంచర్ల  నిర్మిస్తున్న చిత్రం  ఆశా ..ఎన్ కౌంటర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా.

చిత్ర నిర్మాత అనురాగ్ కంచర్ల మాట్లాడుతూ ..అనివార్య కారణాల వలన  పెద్ద సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు రావడం వలన మా చిత్రం విడుదల కావడం జరిగింది.ఇప్పుడు మేము నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము అని అన్నారు.

చిత్ర రచయిత & దర్శకుడు ఆనంద్ చంద్ర మాట్లాడుతూ ..ఈ సినిమా గురించి ఆర్జివి గారు చాలా విషయాలు చెప్పారు. జరిగిన అనేక వాస్తవ కథనాలతో ఈ సినిమా చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నాము. టెక్నీషియన్లకు ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా మంచి పేరు వస్తుంది అని అన్నారు.

రామ్ గోపాల్ వర్మ (RGV) మాట్లాడుతూ.. ఆశా ఎన్కౌంటర్ జరగడానికి కారకులు ఎవరు? అనేది ఈ చిత్రం లో దర్శకుడు చాలా బాగా చూపించాడు. మర్డర్ మూవీ తో తను ఎంతో మంచి దర్శకుడు అనిపించిన ఆనంద్ చంద్ర ఈ సినిమా ద్వారా మరో మెట్టు పైకి ఎదుగుతాడు అని అన్నారు..

ఆశా చిత్ర తారాగణం
శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా అకుల,  వెంకట్, శ్రీధర్, ముని,  నవీన్,  కళ్యాణ్,  ప్రవీణ్,  ప్రశాంతి తదితరులు

రచన,దర్శకుడు: ఆనంద్ చంద్ర

నిర్మాత: అనురాగ్ కంచర్ల

నిర్మాణ పర్యవేక్షణ: ఏవీఎస్ రాజు
సంగీతం: ఆనంద్
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ / మనీష్ ఠాకూర్
DOP: జోషి మలహబారత్
ప్రొడక్షన్ కంట్రోలర్: రామ్ మంతెన (మధు).
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *