Ravi Teja’s “DHAMAKA”- A power packed action Schedule Begins in Hyderabad

హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన ర‌వితేజ ‘ధమాకా’ యాక్ష‌న్ షెడ్యూల్..

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన ల‌ ఫ‌స్ట్ క్రేజీ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న చిత్రం `ధమాకా`. డబుల్ ఇంపాక్ట్ అనేది ట్యాగ్ లైన్‌.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

ధమాకా కొత్త యాక్షన్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది. భారీ సెట్లో రవితేజ మరియు ఫైటర్స్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తోంది చిత్ర యూనిట్‌. ఈ ఎపిసోడ్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్లు పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎపిసోడ్ గురించి నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ – “ హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్. ఇది చిత్రానికి చాలా కీలకం. అందుకే బడ్జెట్‌లో ఎక్కడా రాజీ పడకుండా భారీ సెట్‌ వేశాం. మాస్ ఆడియ‌న్స్‌కి, యాక్షన్‌ సినిమాల అభిమానులకు ఇది త‌ప్ప‌కుండా  ఫీస్ట్‌ అవుతుంది” అన్నారు.

పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

 నటీనటులు: రవితేజ, శ్రీలీల

 సాంకేతిక బృందం

దర్శకుడు: త్రినాథరావు నక్కిన

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

స్టోరీ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ

సంగీతం: భీమ్స్ సిసిరిలియో

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *