Ravi Teja Presents, Vishnu Vishal, Manu Anand, Abhishek Pictures FIR To Release On February 11th

ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో విష్ణు విశాల్‌, మ‌ను ఆనంద్‌, అభిషేక్ పిక్చ‌ర్స్ ఎఫ్ఐఆర్ ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్` చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ఎఫ్ఐఆర్ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజ్ నెల‌కొని ఉంది.

మాస్ మాహారాజా ర‌వితేజ స‌మ‌ర్ఫ‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తుంది. ఫిబ్ర‌వ‌రి11న ఈ చిత్రం రిలీజవుతున్నట్లు ఈ రోజు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్ట‌నున్నారు.

విష్ణు విశాల్ `భీమిలి కబడ్డీ జట్టు`, `రాక్ష‌సుడు` లాంటి చిత్రాలు తెలుగులో రీమేక్ చేశారు. రానా న‌టించిన అర‌ణ్య చిత్రంలో విష్ణు విశాల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఎఫ్ఐఆర్ విష్ణు విశాల్ హీరోగా తెలుగులో రిలీజ‌వుతున్న ఫ‌స్ట్ మూవీ.

సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో, భయంకరమైన ఐస్ఐస్‌ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అనేది ఎఫ్ఐఆర్ మూల‌కథ. ఈ కథ చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు మరియు హైదరాబాద్ వంటి న‌గ‌రాల్లో జ‌రుగుతుంది.

ఈ సినిమా ప్లాట్ చాలా గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రంపై అన్నిభాష‌ల్లో  మంచి బ‌జ్ నెల‌కొని ఉంది.  స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, మాల పార్వతి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండ‌డంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత పెరిగాయి.

నటీనటులు : విష్ణు విశాల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, రైజా విల్సన్, రేబా మోనికా జాన్, మాల పార్వతి తదితరులు

సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత – విష్ణు విశాల్
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం – మ‌ను ఆనంద్‌
స‌మ‌ర్ప‌ణ‌- ర‌వితేజ‌
డిఓపి- అరుల్ విన్సెంట్‌
రిలీజ్- అభిషేక్ పిక్చ‌ర్స్‌
మ్యూజిక్‌- అశ్వంత్‌
ఎడిట‌ర్- ప్ర‌స‌న్న జీకే
స్టంట్స్‌- స్ట‌న్ శివ‌
పాట‌లు – రాకేందు మౌళి
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ – అనిత మ‌హేంద్ర‌న్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ – సీతారాం స్ర‌వంతి సాయినాథ్ దినేష్ క‌ర్ణం

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *