Saturday, June 15, 2024
spot_img

Nithiin’sMovies Macherla Niyojakavargam Movie Releasing Grandly Worldwide On July 8th

నితిన్ మాచర్ల నియోజకవర్గం జూలై 8న ప్రపంచవ్యాప్తం గా థియేటర్ల లో విడుదల

యువ కథానాయకుడు హీరో నితిన్  `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ కి MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి,  నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ రోజు (బుధవారం) నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ ఎటాక్ (టీజర్)ని విడుదల చేశారు.


టీజర్ నితిన్ యాక్షన్ సీన్ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. ముఖానికి పులి రంగు, ఒంటినిండా పులిచారలుతో వున్న కొందరు దుండగులు నితిన్ పై కొడవళ్ళతో దాడిచేయడం వారి నుంచి తను తప్పించుకోవడం తిరిగి ఎదురు దాడి చేయడం థ్రిల్ గా అనిపిస్తుంది. అందరి పై  ఎదురుదాడికి దిగి వారిని తరిమికొట్టే విధానం ఆకట్టుకుంది. ఆ క్రమంలో కొందరిని ఎటాక్చేసి సడన్ గా కూర్చుని మిగిలినవారి రాక గమనిస్తూ చూసిన లుక్ అద్భుతంగా వుంది. ఈ టీజర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఇంపాక్ట్  చూపుతుంది. వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ నితిన్ లో మాస్, యాక్షన్ చూపిస్తూ అద్భుతంగా డిజైన్ చేశారు.

నితిన్ ఈ పాత్రలో చాలా అద్భుతంగా ఉన్నాడు. పూర్తి మీసాలు, చిన్నపాటి గడ్డం గెటప్తో మాస్గా కనిపించాడు. టీజర్ను బట్టి చూస్తే, సినిమాలో కొన్ని హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి అనేది అర్ధం అవుతుంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం అత్యున్నతంగా కనిపిస్తుంది. మహతి స్వర సాగర్ తన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో టీజర్  కి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

టీజర్లో చెప్పినట్లుగా, మాచర్ల నియోజకవర్గం జులై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది.

పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.

నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: MS రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ – రాజ్కుమార్ ఆకెళ్ల
సంగీతం: మహతి స్వర సాగర్
DOP: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్: జి హరి
సంభాషణలు: మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
PRO: వంశీ-శేఖర్

READ IN ENGLISH

Related Articles

- Advertisement -spot_img

Latest Articles