Nikhil, Garry BH, Ed Entertainments National Thriller SPY Non-Theatrical Rights For A Fancy Price

రూ.40 కోట్లకు నిఖిల్, గ్యారీ బిహెచ్, ఈ డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ ఆల్ లాంగ్వేజస్ నాన్-థియేట్రికల్ రైట్స్

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నిఖిల్ తన తర్వాతి పాన్-ఇండియన్ చిత్రం స్పై తో వస్తున్నారు. కార్తికేయ 2 లాగానే ‘స్పై’ కూడా యూనివర్సల్ అప్పీల్, యూనిక్ పాయింట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందుతోంది. పాపులర్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్నిచరణ్‌తేజ్ ఉప్పలపాటి సిఇఓగా ఈ డీ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్  కి అద్భుతమైన  రెస్పాన్స్ తో ఈ చిత్రం అసాధారణమైన బజ్‌ని క్రియేట్ చేసింది. ఇదీలావుండగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. అమెజాన్,  స్టార్ నెట్‌వర్క్ కలిసి ఈ చిత్రం పూర్తి నాన్-థియేట్రికల్ హక్కులను రూ. 40 కోట్లకు పొందాయి, ఇది ఇప్పటివరకు నిఖిల్‌కు హయ్యెస్ట్. వారు సినిమా రష్ ని చూసి, అవుట్ పుట్ అద్భుతంగా వుండటంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ ధర వెచ్చించారు.

నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఆర్యన్ రాజేష్ తన కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

పూర్తి యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.

READ IN ENGLISH

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *