Melody Song Of The Year From Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Will Be Out On February 14th

ఫిబ్రవరి 14న మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా విడుద‌ల‌వ‌నున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్‌ యాక్షన్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `సర్కారు వారి పాట` చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం నుంచి ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించబోతోన్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్రవరి 14న సర్కారు వారి పాట నుంచి రాబోతోన్న ఫస్ట్ సింగిల్.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అద్భుతమైన ట్యూన్‌ అందించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతోన్న ఈ పాట మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద రొమాంటిక్‌గా చిత్రీకరించారు.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు

సాంకేతిక బృందం

రచన‌, దర్శ‌క‌త్వం:  పరుశురామ్ పెట్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
లైన్  ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈవో: చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: యుగంధర్

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *