Mass Maharaja Ravi Teja, Ravanasura Third Single Veyyinokka Jillala Varaku On March 15th

మాస్ మహారాజా రవితేజ, ‘రావణాసుర’ థర్డ్ సింగిల్ వెయ్యినొక్క జిల్లాల సాంగ్

మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ, అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ ‘రావణాసుర’ థర్డ్ సింగిల్ వెయ్యినొక్క జిల్లాల వరకు మార్చి 15న విడుదల

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు.

హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని మూడవ సింగిల్- వెయ్యినొక్క జిల్లాల వరకు లిరికల్ వీడియో మార్చి 15న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇది రెట్రో నేపథ్య పాట అని సూచిస్తుంది. రవితేజ, మేఘా ఆకాష్ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.

విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా యూనిక్ కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్.

ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కానుంది.

తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్
కథ, & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో: వంశీ-శేఖర్

READ IN ENGLISH

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *