Wednesday, February 28, 2024
spot_img

Malgadi Shubha, who sang a heartwarming song called ‘Nara Naramu’ for ‘Inti No.13’

‘ఇంటి నెం.13’ కోసం న‌ర న‌ర‌ము అంటూ హుషారెక్కించే పాట పాడిన మాల్గాడి శుభ

రీగ‌ల్ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో హేస‌న్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. అలాగే ఇటీవ‌ల ఈ సినిమా కోసం శ్రీ‌యా గోష‌ల్ పాడిన ‘పో పోవే…’ అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పాట అంద‌ర్నీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా ఇంటి నెం. 13 చిత్రంలోని మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. డిఫ‌రెంట్ సాంగ్స్‌కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాట‌ను పాడ‌డం విశేషం. ‘న‌ర న‌ర‌ము..’ అంటూ రాంబాబు గోశాల ర‌చించిన ఈ పాట‌కు వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందించారు. ఎంతో హుషారుగా సాగే ఈ పాట యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని  విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

READ IN ENGLISH

Related Articles

- Advertisement -spot_img

Latest Articles