‘Maha Lingapuram First Look’ released on the occasion of Maha Shivaratri !!!

మహా శివరాత్రి సందర్బంగా ‘మహా లింగాపురం ఫస్ట్ లుక్ విడుదల !!!

సాయి దత్త క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ పునీత్ కాడిగారి మరియు మాస్టర్ మనో రూపేష్ సమర్పణలో ప్రవీణ్ రెడ్డి కాడిగారి నిర్మాతగా శ్యామ్ మండల దర్శకత్వంలో వస్తోన్న సినిమా మహా లింగాపురం. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హరీష్ వినయ్, ప్రియాంక దే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రభావతి, అంబటి శ్రీనివాస్, మహేంద్రనాధ్ తాటికొండ, సివిఎల్ తదితరులు ముఖ్య పాతాల్లో నటిస్తున్నారు.

దర్శకుడు శ్యామ్ మండల గతంలో ట్రూ, అం అః చిత్రాలకు దర్శకత్వం వహించారు, తన దర్శకత్వంలో వస్తోన్న మూడో చిత్రం మహా లింగాపురం. మహా శివరాత్రి సందర్భంగా మహా లింగాపురం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…
మహా శివలింగాపురం సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో వర్క్ చేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, నా దగ్గర వర్క్ చేసిన దర్శకుడు శ్యామ్ మండల కు మంచి సక్సెస్ రావాలని అన్నారు.

దర్శకుడు శ్యామ్ మండల మాట్లాడుతూ…
మహా శివలింగాపురం చిత్ర ఫస్ట్ లుక్ ను సురేందర్ రెడ్డి గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. సస్పెన్స్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాను అన్నారు.

నటీనటులు:
హరీష్ వినయ్, ప్రియాంక దే, అజయ్, రామరాజు, దువ్వాసి మోహన్, అంబటి శ్రీనివాస్,మాస్టర్ పునీత్, మాస్టర్ మనో రూపేష్, చైతన్య, సివిఎల్, ప్రభావతి, మహేంద్రనాధ్ తాటికొండ తదితరులు

సాంకేతిక నిపుణులు:
కెమెరా: శివా రెడ్డి శవనం
ఎడిటర్: జేపి
మ్యూజిక్: సందీప్ కంగుల
ఫైట్స్: రవి ఎల్పురి, నందు
డాన్స్: కపిల్
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి కాడిగారి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్యామ్ మండల

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *