Lyrical Video Of From VARAHI Chalana Chitram’s Bhala Thandanana Out

శ్రీవిష్ణు, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం `భళా తందనానా` నుండి మొదటి సింగిల్ లిరికల్ వీడియో వ‌చ్చేసింది

శ్రీవిష్ణు, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం `భళా తందనానా` నుండి మొదటి సింగిల్ లిరికల్ వీడియో వ‌చ్చేసింది

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం `బాణం` ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో న‌టిస్తున్న చిత్రం `భళా తందనానా`అన్న‌విష‌యం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోన్న ఈ  చిత్రంలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ త్రెసా నటిస్తోంది. యాక్షన్‌తో కూడిన శ్రీవిష్ణు  ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా, ఆదివారంనాడు `భళా తందనానా` నుంచి `మీనాచ్చీ మీనాచీ` అనే మొదటి సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేయడం ద్వారా చిత్ర యూనిట్ సంక్రాంతి సందర్భంగా సంగీత ప్రమోషన్‌లను ప్రారంభించింది. ఇది గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న‌క‌థాంశం. ఇందులో క‌నిపించిన పోస్ట‌ర్‌లో కేథరీన్ థ్రెసా సమక్షంలో శ్రీవిష్ణు ఒక పల్లెటూరి అమ్మాయితో సరసాలాడుతుండం ఆస‌క్తిగా మారింది.

మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఆహ్లాదకరమైన బాణీని స‌మ‌కూర్చాడు. త్రిపురనేని కళ్యాణచక్రవర్తి సాహిత్యం అందించగా, ధనుంజయ్ సీపాన ఎనర్జిటిక్‌గా పాడారు.

దర్శకుడు చైతన్య దంతులూరి శ్రీవిష్ణుని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయగా, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న కేథరిన్‌కు భాళ తందానాలో మంచి పాత్ర లభించింది. కెజిఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు.

సాయి కొర్రపాటి సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రజనీ కొర్రపాటి నిర్మాత.

సురేష్ రగుతు సినిమాటోగ్రాఫ‌ర్ కాగా,. శ్రీకాంత్ విస్సా రచయిత, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వున్న ఈ సినిమాకు ప్ర‌ముఖ‌ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

షూటింగ్ పూర్త‌యిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తారాగణం: శ్రీవిష్ణు, కేథరిన్ త్రెసా, రామచంద్రరాజు త‌దిత‌రులు

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు – చైతన్య దంతులూరి, నిర్మాత – రజనీ కొర్రపాటి, స‌మ‌ర్ప‌ణ‌- సాయి కొర్రపాటి, బ్యానర్: వారాహి చలనచిత్రం, సంగీతం – మణి శర్మ, ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్, కెమెరాః  సురేష్ రగుతు, యాక్ష‌న్‌- పీటర్ హెయిన్, కళ – గాంధీ నడికుడికార్‌, ర‌చ‌న‌ – శ్రీకాంత్ విస్సా
PRO: వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *