Leading producer AM Ratnam launches ‘Packup’ with Clap

ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్.రత్నం క్లాప్‌ తో ‘ప్యాకప్’ చిత్రం ప్రారంభం

పిజిపి ప్రొడక్షన్స్ (పానుగంటి ప్రొడక్షన్స్) బ్యానర్‌పై వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘ప్యాకప్’. జివిఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్. రత్నం ముఖ్య అతిథిగా హాజరై హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో వాసం నరేశ్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా టీమ్‌ను ఆశీర్వదించిన రత్నంగారికి ధన్యవాదాలు. ఈ చిత్రం అనేక టర్న్‌లు తీసుకుని, ఇప్పుడు భారీగా తెరకెక్కేందుకు రెడీ అయింది. మంచి టీమ్ కుదిరింది. ఖచ్చితంగా మంచి హిట్ కొడతామనే ఆశతో ఉన్నాం. ఇటువంటి కథతో హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

హీరోయిన్ ఆశ ప్రమీల మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. డాక్టర్, యాక్టర్ అంటూ చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం నేను డాక్టర్‌. ఈ చిత్రంతో యాక్టర్‌గా మారుతున్నాను. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను..’’ అని అన్నారు.

డైరెక్టర్ జివిఎస్ ప్రణీల్ మాట్లాడుతూ.. ‘‘ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై, మమ్మల్ని ఆశీర్వదించిన ఏఎమ్ రత్నంగారికి చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు. నూతన హీరోహీరోయిన్లను ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నాం. మంచి కథ. యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రేమలో ఉండే ఒక వైవిధ్యకోణాన్ని ఈ చిత్రంతో చెప్పబోతున్నాం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

నిర్మాత పానుగంటి శరత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌గారితో ‘హరిహర వీరమల్లు’ చిత్రం చేస్తున్న నిర్మాత ఏఎమ్ రత్నంగారు మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చి, టీమ్‌ని ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మా యూనిట్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు ప్రణీల్ తెలుగు ప్రేక్షకులకు మంచి కథ చెప్పబోతున్నారు. కథకి తగినట్లుగా హీరోహీరోయిన్లు, సాంకేతిక నిపుణులు కుదిరారు. ఏకధాటిగా షూటింగ్ జరపనున్నాం. మా బ్యానర్‌కి ఈ చిత్రం మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాం..’’ అని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్, కెమెరామెన్ వైవి శ్రీధర్, విఎఫ్ఎక్స్ హెడ్ పీటర్ విజయ్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్ శ్రీకృష్ణ గుళ్లపల్లి వంటి వారంతా పాల్గొని.. చిత్రం విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు.

వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి
బ్యానర్: పిజిపి ప్రొడక్షన్స్ (పానుగంటి ప్రొడక్షన్స్),
మ్యూజిక్: సుభాష్ ఆనంద్,
కెమెరా: వై.వి. శ్రీధర్,
విఎఫ్‌ఎక్స్: పీటర్ విజయ్ రాజ్,
లైన్ ప్రొడ్యూసర్: శ్రీకృష్ణ గుళ్లపల్లి,
పీఆర్వో: బి. వీరబాబు,
నిర్మాత: పానుగంటి శరత్ రెడ్డి,
దర్శకత్వం: జివిఎస్ ప్రణీల్.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *