ప్రముఖ గాయకుడు బప్పి లహరి (69 ) మంగళవారం రాత్రి ముంబై లో మరణించారు.

తన అదృష్టం కోసం ధరించే ట్రేడ్ మార్క్ బంగారు గొలుసు మరియు సన్ గ్లాస్సెస్ తో చాల మందికి సుపరిచితుడు, 70-80 లలో వచ్చిన సినిమాలకు అతని పాటలు చాల ప్రసిద్ధి.
భారతదేశంలో డిస్కో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన గాయకుడు బప్పి లహరి , అనేక ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారని 16వ తేదీ బుధవారం ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. ఆయనకు 69 సంవత్సరాలు.
నెల రోజులుగా బప్పి లహరి ఆసుపత్రిలో ఉన్నారు సోమవారం డిశ్చార్జ్అయ్యారు , కానీ మంగళవారం ఆయన ఆరోగ్యం క్షీణించడం తో మల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఆయన మరణించారు, ఆయనకు ముఖ్యం గా OSA ( అబ్స్ట్రాక్టీవ్ స్లీప్ అప్నియా ) కారణంగా చనిపోయారనని వైద్యులు తెలిపారు.
బప్పి లహరి 1970-1980 లలోని చిత్రాలలో చల్తే చల్తే , డిస్కో డాన్సర్ , జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా … పాటలతో ప్రపంచ ఖ్యాతి పొందాడు, తరువాత జక్మి , లాహూ కే దో పంగ్ కి సూపర్ హిట్ సంగీతం అందించాడు.

1952లో పశ్చిమ బెంగాల్ లోని కోలకతా లో జన్మించిన బప్పి తన తండ్రి అపరేశ్ లహరి మరియు తల్లి బన్సారి లాహిరి సంగీత విధ్వాంసులు కావడం తో చిన్న తనంలోనే సంగీతానికి దగ్గరయ్యారు. తన 3 సంవత్సరాల వయస్సులోనే తబలా వాయించడం మొదలుపెట్టాడు, ఆ తరువాత తాను ఇంకా ఎదిగిపోయారు.
బప్పి లహరికి ఒక భార్య , ఇద్దరు పిల్లలు , అతని చివరి పాట 2020 లో వచ్చిన బాఘీ 3 కోసం భంకాస్ పాడారు, బప్పి లహరి ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షో కి తన మనవాడి ఆల్బం సాంగ్ ప్రమోషన్ కోసం వచ్చారు.

ఇండస్ట్రీలో ” బప్పి డా ” గా ముద్దుగా పిలుచుకునే లహరి మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బప్పి లహరి మృతికి AR రెహమాన్ సంతాపం తెలుపుతూ … #RIPbappida … హిందీ సినిమా డిస్కో కింగ్ బప్పి లహరి అని ట్వీట్ చేశారు.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రీ బప్పి లహరి జీ సంగీతం అంత ఆవరించి వైవిధ్యమైన భావోగ్వేదాలను వ్యక్తీకరించింది. తార తరాలుగా ప్రజలు అతని రచనలతో సంబంధం కలిగి ఉంటారు, ఆయన మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
