“Goal Mall 2020” to be released in theaters on February 18

ఫిబ్రవరి 18న థియేటర్ లలో రిలీజ్ అవుతున్న “గోల్ మాల్ 2020”

మిట్టకంటి రామ్ , విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత , మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా తెరకేకించిన కొత్త చిత్రం “గోల్ మాల్ 2020″ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఫిబ్రవరి 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘అమృతారామమ్” తర్వాత రామ్, “దేవరకొండలో విజయ ప్రేమకథ”, “కపటనాటక సూత్రధారి” తర్వాత విజయ్ శంకర్ నటిస్తున్న “గోల్ మాల్ 2020” చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి.

“goalmal2020” చిత్రాన్ని నూతన దర్శకుడు జాన్ జిక్కి తెరకెక్కించారు. కె.కె.చైతన్య సమర్పిస్తున్న ఈ మూవీని “బాబీ ఫిలిమ్స్ ” ప్రొడక్షన్ నిర్మించింది . పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “goalmall2020” టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. feb18న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. “golmal2020” చిత్రంలోని ఇంతలొ ఎన్నిని వింతలో పాట ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి సింగర్ జావీద్ అలీ, సుకుమారి..సుకుమారి.. అర్మాన్ మాలిక్ పాడిన పాటలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి . రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా

డైరెక్టర్ జాన్ మాట్లాడుతూ…“గోల్ మాల్ 2020″ ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇందులో రామ్ ఇంకా విజయ మిగిలిన పత్రాలు అందరు రెట్రో లుక్ లో కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మనం గతంలో కోల్పోయిన ప్రేమ తాలుకు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటె జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ , ఇది ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ కామెడీ డ్రామా , ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం.రిట్రో మిక్స్ అయినా చిత్రం feb 18న థియేటర్లలో కలుసుకుందాం ” అన్నారు

టెక్నికల్ టీమ్:
సమర్పణ : బాబీ ఫిలిమ్స్
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
రిట్రో కాన్సెప్ట్ : బాబీ కె.ఎస్ .ఆర్
సినిమాటోగ్రఫీ: జగన్ . ఏ
ఎడిటర్ : నాహిద్
మ్యూజిక్: కనిష్క
నిర్మాత: కే.కే చైతన్య
రచన-దర్శకత్వం: జాన్ జక్కి

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *