” EE KATHALO NENU ” from ‘NUVVUNNADI NEE LOKAM KAADEMO ANIPISTHUNDI’ song release

”ఈ కథలో నేను” నుంచి ‘నువ్వున్నది నీలోకం కాదేమో అనిపిస్తుంది’ సాంగ్ విడుదల

అవతార్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1గా నిర్మించిన చిత్రం ”ఈ కథలో నేను”. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్, గోవా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో హీరోలుగా హోమానంద్, రేవంత్ – హీరోయిన్ గా సిమ్రాన్ పరింజా( తెలుగు కిర్రాక్ పార్టీ ఫేం), నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నువ్వున్నది నీలోకం కాదేమో అనిపిస్తుంది’ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఈ పాటను సింగర్ ఉష ఆలపించారు. ఈ సినిమాకి సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు శ్రీ యోగి సంగీతం అందిస్తుండగా ఆయన అందించిన సంగీతం, ఉష గాత్రం, సిరివెన్నెల రచన కలగలిపి సాంగ్ అద్భుతంగా కుదిరింది. యశ్వంత్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఇక రేవంత్ – హీరోయిన్ సిమ్రాన్ పరింజాల మీద చిత్రీకరించారు.

ఇక ”ఈ కథలో నేను” చిత్రానికి ప్రముఖ మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రా కథ, మాటలతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇక సినిమాలోని ఇతర ముఖ్య పాత్రల్లో నరేష్, పోసాని కృష్ణమురళి, మధునందన్, బిగ్ బాస్ తేజస్విని, అభయ్ బేతిగంటి ఈ రోజుల్లో సాయి, కిరీటి, జబర్దస్త్ రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, శశిధర్, అనిత, సావేరి నటించారు. ఈ సినిమాకు రాజ్ కృష్ణ, యష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా కీర్తిశేషులు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించడం విశేషం. సాయి కిరణ్, రెహమాన్, సాగర్ కూడా సాహిత్యం అందించారు. మధు రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న మల్హర్ బట్ జోషి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. అచ్చిబాబు. ఎం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం యం.యస్. ఫణిరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టి.వి కేశవతీర్థ నిర్మించారు.

READ IN ENGLISH

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *