Chor Bazaar Title Song Lyrical Launched By Actor Ram

Chor Bazaar Title Song Lyrical Launched By Actor Ram

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా టైటిల్ సాంగ్ ను శుక్రవారం స్టైలిష్ హీరో రామ్ పోతినేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ…చోర్ బజార్ టైటిల్ సాంగ్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా ట్రెండీగా ఉండి, గల్లీ బాయ్స్ పాటలా అనిపించింది. ఆకాష్ క్యారెక్టరైజేషన్, ఆటిట్యూడ్ అదిరిపోయినట్లు పాటతో తెలుస్తోంది. రెగ్యులర్ పాటలా కాకుండా ర్యాప్ తో టూడేస్ సాంగ్ లా చేశారు. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఆకాష్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా. ఇలాగే ట్రెండ్ సెట్టర్స్ గా సినిమాలు చేస్తూ ఉండాలని విష్ చేస్తున్నా. అన్నారు.

చోర్ బజార్ టైటిల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే…మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె..దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె..ఇది చోర్ బజార్…ఆజా చోర్ బజార్..ప్రతి బస్తీలో ఉంటనేను లేదు నాకు ఆధార్..నచ్చినట్లు బతుకుతుంట లేదు నాకు బాధ…ఖద్దరైన, ఖాకీ అయిన లేదు నాకు తేడా, రంగు రంగు జీవితాలు చోర్ బజార్ ఆజా…అంటూ సాగుతుందీ గీత. రాప్ స్టైల్ లో సాగిన ఈ పాట మంచి ఎనర్జీతో సాగుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను వివరించింది. నవాబ్ గండ్, అసురన్ టీమ్ ఈ పాటకు సంగీతాన్ని, ర్యాప్ అందించి పాడారు

"చోర్ బజార్" సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ ఆర్ట్ – గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రసన్న దంతులూరి, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను, పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను , స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో – జీఎస్కే మీడియా, మేకప్ – శివ, కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్, డిజిటల్ మీడియా – టాక్ స్కూప్, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ – ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి.

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *