Monday, April 15, 2024
spot_img

Chai Bisket’s Original 30 Weds 21 Season 2 First Look Out

చాయ్ బిస్కెట్ ఒరిజినల్ సీరీస్ 30 వెడ్స్ 21 సీజన్ 2 ఫస్ట్ లుక్ విడుదల.

చాయ్ బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్‌లో విడుదలైన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ లాక్డౌన్‌లో అందరినీ అలరించింది. చైతన్య, అనన్యల జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. అసమర్థుడు, మనోజ్ పీ సంయుక్తంగా రెండో సీజన్ కాన్సెప్ట్‌ను రాయగా.. పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. రెండో సీజన్ త్వరలోనే రాబోతోంది. నేడు యూనిట్ ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

చైతన్య, అనన్య ఇద్దరూ కూడా ఈ పోస్టర్‌లో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌తోనే రెండో సీజన్ మీద పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్‌లోనే టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జనవరి 31న వెబ్ సిరీస్ రెండో సీజన్‌కు సంబంధించిన టీజర్ రాబోతోంది.

జోస్ జిమ్మి సంగీతాన్ని అందించగా.. ప్రత్యక్ష్ రాజు కెమెరామెన్‌గా, తారక్ సాయి ప్రతీక్ ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

నటీనటులు : చైతన్య రావు, అనన్య, మహేందర్, దివ్య, వీరభద్రం, శ్రీ కుమారి

సాంకేతిక బృందం

డైరెక్టర్  : పృథ్వీ వనం
రచయితలు :  #అసమర్థుడు, మనోజ్ పీ
సినిమాటోగ్రఫీ  : ప్రత్యక్ష్ రాజు
ఎడిటింగ్ అండ్ డిజైనింగ్  : తారక్ సాయి ప్రతీక్
మ్యూజిక్ : జోస్ జిమ్మి

READ IN ENGLISH

Related Articles

- Advertisement -spot_img

Latest Articles