Boyapati Sreenu, Ram Pothineni’s #BoyapatiRAPO Releasing Worldwide On October 20th

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని, #BoyapatiRAPO అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ చిత్రం #BoyapatiRAPO శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు యాక్షన్, మాస్ లో ఎక్కువగా ఉండబోతున్నాయి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్తో అత్యంత నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈరోజు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్. #BoyapatiRAPO దసరా కానుకగా అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది. మాస్ తో పాటు ఫ్యామిలీస్ ని మెప్పించే సినిమాకి ఇది సరైన తేదీ. దసరా సెలవులు సినిమాకి  కలిసిరాబోతున్నాయి.

అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రామ్ తన చేతితో గంగిరెద్దు (ఎద్దు)ని లాగుతూ పోస్టర్ లో రగ్డ్, మాస్ గా కనిపిస్తున్నారు. డెనిమ్స్ షర్టు, జీన్స్ లో క్లాస్ గా, ఫ్యాషనబుల్ గా కనిపిస్తున్నప్పటికీ, అతని ముఖంలో వైల్డ్ నెస్ కనిపిస్తుంది. బోయపాటి శ్రీను రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నారు.

మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్  శ్రీలీల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు.

ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజుఎడిటింగ్ అందిస్తుండగా, సంతోష్ డిటాకే కెమరామెన్ గా పని చేస్తున్నారు.  

#BoyapatiRAPO హిందీ, అన్ని సౌత్ ఇండియన్ భాషలలో విడుదల అవుతుంది.

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల

సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్

READ IN ENGLISH

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *