Saturday, June 15, 2024
spot_img

Bigg Boss Non Stop: – Full details of Bigg Boss Telugu OTT competitors

బిగ్ బాస్ నాన్ స్టాప్ :- బిగ్ బాస్ తెలుగు OTT పోటీదారుల పూర్తి వివరాలు

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటి షో OTT వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎట్టకేలకు శనివారం { ఫిబ్రవరి 26 } ప్రారంభం అయ్యింది. ప్రారంభ ఎపిసోడ్ లో 17 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారు. మునుపటి సీసన్స్ లో మాదిరి ఎక్కువగా హడావుడి లేకుండా హౌస్ మేట్స్ అందరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపడం జరిగింది. వారియర్స్ అండ్ చాలెంజర్స్ అనేది ఈ సీజన్లో థీమ్ అనుకోవచ్చు . వారియర్స్ గా మునుపటి సీసన్స్ లో వచ్చిన కంటస్టెంట్స్ , చాలెంజర్స్ గా కొత్త ఆటగాళ్లతో బిగ్ బాస్ తెలుగు OTT ని ప్రారంభించారు. ఈ సీజన్ కి సంబందించిన కంటస్టెంట్స్ లిస్ట్ చుడండి.

అఖిల్ సార్థక్
బిగ్ బాస్ సీజన 4 లో రన్నర్ అప్ గా నిలిచిన అఖిల్ ఈ నాన్ స్టాప్ సీజన్ లో వారియర్ గా మళ్ళీ వచ్చాడు. సీజన్ 4 లో మోనాల్ తో ప్రేమాయణం , అభిజిత్ తో గొడవలు , సోహెల్ తో స్నేహం ఇలా అందరిని తన స్టైల్ లో ఆకట్టుకున్నాడు అఖిల్ . తెలుగు టీవీ లలో నటుడు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అయినా అఖిల్ అభిమానులను ఎలా ఆకట్టుకోవాలో తనకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ఈ OTT వెర్షన్ లో తన మేజిక్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి .

ఆశు రెడ్డి
ఇంటర్నెట్ లో సంచలంగా మారిన ఈ యాంకర్ గతంలో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొంది . అయితే ఆ సీజన్ మధ్యలోనే తాను ఎలిమినతె అయ్యింది, అయితే ఉన్న కొద్దీ రోజులైనా అందరిని తన వైపు బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. తరువాత యాంకర్ రవి తో కలిసి హ్యాపీ డేస్ షో చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ OTT వెర్షన్ లో ఎలా అభిమానాన్ని సంపాదించుకుంటుందో చూడాలి.

మహేష్ విట్టా
బిగ్ బాస్ సీజన్ 3 లో కనిపించిన మహేష్ విట్టా ఇప్పుడు OTT వారియర్ కంటెస్టెంట్ లలో ఒకరిగా బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి వచ్చాడు. తన గత సీజన్ లో మొదటి వారం లోనే వరుణ్ సందేశ్ తో గొడవ తో చాల బలమైన కంటెస్టెంట్ గా ఎదిగారు. అంతే కాకుండా చాల మంది అభిమానులని సంపాదించుకున్నారు. తారువాత చాలా సినిమాలలో కూడా నటించారు.

అరియనా గ్లోరీ
బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైనలిస్ట్ అయినా అరియనా తిరిగి మళ్ళీ నాన్ స్టాప్ లోకి తిరిగి వచ్చింది. ఒకానొక సమయంలో అరియనా ప్రదర్శనకు తానె విన్నర్ అనేంతగా ప్రదర్శించింది. ఇంక ఆ సీజన్ తరువాత తను రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ తో ఇంకా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ లో మొదటి మహిళా విజేతగా నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.

తేజస్వి మడివాడ
బిగ్ బాస్ సీజన్ 2 లో వివాస్పద పోటీదారులలో తేజస్వి ఒకరు. మగ వారితో దీటుగా టాస్క్ లు ఆడటం , “సామ్రాట్ “తో ప్రేమాయణం , మంచి మంచి వంటలు చేస్తూ అందరిని ఆకట్టుకోవడం ఇవన్నీ తేజస్వి గురించి చెప్పుకోవాల్సిన విషయాలు. ఆ సీజన్ తరువాత మళ్ళీ ఒక్క వెబ్ సిరీస్ లో తప్ప ఎప్పుడు తాను బుల్లితెర మీద కనిపించలేదు. ఇప్పుడు వారియర్ కంటస్టెంట్ గా మళ్ళీ బిగ్ బాస్ OTT లోకి అడుగుపెట్టింది.

నటరాజ్
బిగ్ బాస్ సీజన్ 5 లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించగలిగారు. తన సీజన్ లో చాల బలమైన పోటీదారుగా నిరూపించబడ్డారు. నటరాజ్ ఇప్పుడు వారియర్ గా OTT వెర్షన్ లో తాను మంచి ప్రదర్శన చేసి విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాడు.

హమీద
నటరాజ్ తో పాటు హమీద కూడా బిగ్ బాస్ సీజన్ 5 కంటస్టెంట్. హమీద OTT వెర్షన్ ఇంకా మొదలవ్వకముందే తాను ఈ సీజన్ లో ఉంటుంది అనే పుకార్లు వచ్చాయి. అందరు అనుకున్నట్లే ఇప్పుడు ఆమె వారియర్ గా మళ్ళీ OTT వెర్షన్ లోకి తిరిగి వచ్చింది.

7 ఆర్ట్స్ సరయు
బిగ్ బాస్ టీం సరయు OTT నాన్ స్టాప్ లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆమె కూడా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న కంటస్టెంట్ , అయితే ఊహించని విధంగా ఆమె సీజన్ మొదటి వారం లోనే ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆమెకు రెండవ అవకాశంగా OTT వెర్షన్ లో వారియర్ గా ఆమె తన గేమ్ ఎలా మార్చుకొని ముందుకు వెళ్తుందో చూడాలి.

ముమైత్ ఖాన్
తెలుగు లోనే కాకుండా అనేక భాషలలో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ ప్రముఖ డాన్సర్ తెలుగులో మొట్ట మొదటి సీజన్ పోటీదారులలో ఒకరు. ఆ షో కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. మొదటి సీజన్ లో చాల మంచి ప్రదర్శన కనబరిచిన ముమైత్ ఖాన్ మళ్ళీ ఇప్పుడు OTT నాన్ స్టాప్ లో తీసుకోవడం హర్షించదగ్గ విషయం. అప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు ఆమెను ఇంటి నుంచి పంపించడం సంచలనం సృష్టించింది. తరువాత ఓంకార్ హోస్ట్ చేసిన డాన్స్ + షో లో అయిదుగురు న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. మళ్ళీ ఇప్పుడు OTT నాన్ స్టాప్ వెర్షన్ లో వారియర్ గ అభిమానులని అలరించడానికి వచ్చింది.

RJ చైతు
హైదరాబాద్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన RJ ల్లో చైతు ఒకడు. హైదరాబాద్ కి చెందిన రేడియో లో రేడియో జాకీగా పని చేస్తున్న చైతు చాల ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు. అతను శ్రీ ముఖి , విష్ణుప్రియ ఇంకా మనకు తెలిసిన చాల మందికి తాను స్నేహితుడు. తాను ఇప్పుడు ఛాలెంజర్ గా ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో

బిందు మాధవి
తెలుగమ్మాయిగా 20008 లో తెలుగు సినిమా ఆవకాయ్ బిరియాని సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించింది. 2011 వరకు బంపర్ ఆఫర్ , రామ రామ కృష్ణ కృష్ణ , పిల్ల జమిందార్ వంటి సినిమాలలో ముఖ్యమైన పాత్రలు పోషించింది. అయితే ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. బిందు మాధవి తమిళ్ బిగ్ బాస్ లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు ఆమె తెలుగులో OTT వెర్షన్ లో ఛాలెంజర్ గా వచ్చారు.


స్రవంతి చొకారపు


ఆంధ్రప్రదేశ్ లోని కదిరికి చెందిన ఈ ఎనర్జెటిక్ యాంకర్, ఆమె హోస్టింగ్ తో పాటు నవ్వు తో కూడా చాల ప్రసిద్ధి. ఆమె తెలుగు న్యూస్ చానెల్స్ లో , ఎంటర్టైన్మెంట్ చానెల్స్ లో చాలా షోలు చేసింది. బిగ్ బాస్ OTT వెర్షన్ లో ఆమె ఎంట్రీ రోజున నాగార్జున తో మాట్లాడుతూ ఆమె కులాంతర వివాహం గురించి మాట్లాడారు. ఆమె భర్త మరియు కొడుకు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేసారు.

మిత్ర శర్మ

ముంబై కి చెందిన ఈమె హిందీ టీవీ తో తన నటన జీవితాన్ని చాల త్వరగా ప్రారంభించింది. సైకలాజికల్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఫుల్ టైం నటి గా మారింది. తరువాత హైదరాబాద్ కి వచ్చి తెలుగులో “తొలి సంధ్య వేళలో” చిత్రం లో నటించారు. మిత్రాకి ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. మిత్ర ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో చాలెంజర్స్ ఒకరిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

యాంకర్ శివ

ఈ ప్రముఖ యాంకర్ యూట్యూబ్ లో సెలెబ్రెటీ లను వివాస్పదంగా ఇంటర్వ్యూ చేస్తూ అందరికి చాల తొందరగా పరిచయం ఐయ్యారు. శివ చాల మంది మాజీ బిగ్ బాస్ కంటస్టెంట్ లను ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు శివ కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఛాలెంజర్ గా అడుగుపెట్టాడు.

READ IN ENGLISH

Related Articles

- Advertisement -spot_img

Latest Articles