Bheemla Nayak’s swashbuckling trailer sets the tone for a tantalising face-off between Pawan Kalyan and Rana Daggubati

హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘భీమ్లా నాయక్’ ట్రైలర్

హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘భీమ్లా నాయక్’
ట్రైలర్

*’భీమ్లా నాయక్’ ట్రైలర్ విడుదల

  • నాయక్‌ నీ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ!!
    పవర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటున్న ‘భీమ్లానాయక్‌’ ట్రైలర్‌!!
    *శ్రీ కె.టి.ఆర్ గారు ముఖ్య అతిథిగా 23 న
    ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక .

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు
సాగర్. కె. చంద్ర.

*హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘భీమ్లా నాయక్’
ట్రైలర్ విడుదల:

ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 9గంటలకు విడుదల అయింది. ట్రైలర్ ను గమనిస్తే….

‘‘సర్హద్‌ భీమ్లానాయక్‌.. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌..
శ్రీశైలం తహసీల్దారు, హఠకేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్‌.
నేను ఇవతల ఉంటేనే చట్టం… అవతలకొస్తే కష్టం.. వాడికి’’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.

‘‘కిలోమీటర్‌ ఊరు. సర్‌… దాటితే మొత్తం అడివే..
పాయింట్‌ బ్లాంక్‌లో వాణ్ణి కాల్చి తుప్పల్లో పడదొబ్బితే..
పది రోజులు పడుతుంది శవం దొరకడానికి!!
నేను ఇవతల ఉంటేనే చట్టం… అవతలకొస్తే కష్టం.. వాడికి.. ’’ అంటూ పవన్‌కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా అభిమానుల్ని మెప్పించేలా ఉన్నాయి. అభిమానులకు పండగే అన్నట్లు త్రివిక్రమ్‌ సంభాషణలు సమకూర్చారు. పవన్‌, రానాల మధ్య సాగే సంభాషణలు పవర్‌ఫుల్‌గా ఉండడమే కాక అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ
చిత్రంలో ఉన్నట్లు అర్థమవుతోంది.
‘‘నాయక్‌… నీ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ’’ అని ట్రైలర్‌ చివరిలో రానా చెప్పిన డైలాగ్‌లకు థియేటర్‌ దద్దరిల్లేలా కనిపిస్తోంది.

హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ఈ ‘భీమ్లా నాయక్’ సొంతం. ‘భీమ్లా నాయక్’ ( పవన్ కళ్యాణ్),
‘డేనియల్ శేఖర్ ( రానా) ల మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు,పోరాట దృశ్యాలు, పాటలు, నేపథ్య సంగీతం దేనికదే ఒకదాన్ని మించిన మరొకటి అన్నట్టుగా సాగి అభిమానుల ఆనందం అంబరాన్ని తాకేలా చేస్తాయి. పవన్ కళ్యాణ్, రానా, నిత్య మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, పమ్మి సాయి, రామకృష్ణ లు పాత్రోచితంగా ట్రైలర్ లో కనిపించి అలరిస్తారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న, పవర్‌ తుఫాను అంటూ రెట్టింపు ఉత్సాహం, అంచనాలు పెంచేసింది ట్రైలర్‌ . అభిమానులకు పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేసింది.

*శ్రీ కె.టి.ఆర్ గారు ముఖ్య అతిథిగా 23 న
‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక .

చిత్రం ఈనెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ నెల 23న ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా నిర్వహించటానికి చిత్ర బృందం సంకల్పించింది. హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభ మవుతుంది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కె.టి.ఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర
సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బృందం అంతా పాల్గొననుంది.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, సునీల్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, రామకృష్ణ, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *