Thursday, February 22, 2024
spot_img

‘అనుభవించు రాజా’ ఎలా ఉందంటే..?

యంగ్‌ హీరో రాజ్ తరుణ్ ఓ సాలిడ్‌ హిట్‌గా చాలా కష్టపడుతున్నాడు. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాజ్‌ తరుణ్‌..ఆ తర్వాత ఆ హవాను కొనసాగించడంలో విఫలమం అయ్యాడు. ఇప్పటి వరకు ఆయన డజన్‌కు పైగా చిత్రాలు చేసినప్పటికీ.. కెరీర్ మొద‌ట్లో వ‌చ్చిన ఉయ్యాల జంపాల‌, కుమారి 21 ఎఫ్ మాత్ర‌మే హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో ‘అనుభ‌వించు రాజా’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు.. సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ శుక్రవారం(నవంబర్‌ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనుభవించు రాజా’ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

‘అనుభవించు రాజా’ కథేంటంటే
పశ్చిమగోదావరి జిల్లా యండగండికి చెందిన బంగార్రాజు అలియాస్‌ రాజ్‌ (రాజ్‌ తరుణ్‌) పూర్వికులు కోటీశ్వరులు. పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటకీ.. రాజ్‌ మాత్రం సొంత ఊరిని వదిలి హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం చేస్తుంటాడు. ఇదే సమయంలో అతన్ని హత్య చేసేందుకు గని గ్యాంగ్‌కు ఓ వ్యక్తి పెద్ద ఎత్తున సుపారీ ఇస్తాడు. అసలు రాజ్‌ హత్య చేయడానికి సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? కోట్ల ఆస్తులకు అధిపతి అయిన రాజ్‌..సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం ఎందుకు చేశాడు? అతను గ్రామం నుంచి పారిపోవడానికి గల కారణాలేంటి? అనేదే మిగతా కథ.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles