AM Ratnam is the director who released the “Rose Garden” teaser

“రోజ్ గార్డెన్” టీజర్ ను విడుదల చేసిన దర్శకనిర్మాత ఏ ఎం రత్నం

చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు కశ్మీర్ లో భారీ ఎత్తున నిర్మించిన మ్యూజికల్ లవ్ స్టొరీ రోజ్ గార్డెన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధమైంది. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్రం టీజర్ ను ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ చిత్రం విజయం సాధించాలని అంటూ రత్నం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, హీరో నితిన్ నా ష్, దర్శకుడు రవికుమార్ పాల్గొన్నారు.

టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కథా చిత్రం సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందనీ, సినిమాలోని అన్ని పాటలను ముంబై లో రికార్డ్ చేశామని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. సినిమాలోని ఒక పాటను ఏ ఎం రత్నం రాసినట్లు ఆయన తెలిపారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న రోజ్ గార్డెన్ చిత్రంలో తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్ ప్రత్యేక పాత్ర పోషించారు. పోసాని, గౌతమ్ రాజు, ధన రాజ్ తో పాటు ముంబై కు చెందిన అశోక్ కుమార్ బెనివాల్, మిలింద్ గునా జీ, గౌహర్ ఖాన్, బబ్రక్ అక్బరి, సునీల్ శర్మ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ..శంకర్ కంతేటి, ఎడిటింగ్ నందమూరి హరి, కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం జి.రవికుమార్.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *