Ajith’s Valimai will be released on January 13

అజిత్ కుమార్ హీరోగా, బోనీ కపూర్ నిర్మించిన ‘వాలిమై’ సంక్రాంతి సందర్భంగా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లోజనవరి 13న గ్రాండ్ రిలీజ్

అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల అవుతుంది.   జీ స్టూడియోస్‌ సంస్థ,  బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన   తమిళ ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్ తో  రికార్డు క్రియేట్ చేసింది.  ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా జనవరి 13న విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ:  గత ఏడాది కోవిడ్ 19 కారణంగా షూటింగ్ కి గ్యాప్ వచ్చినా ఆ తర్వాత ఈ చిత్రం షూటింగ్ నిరాటంకంగా పూర్తి చేసి జనవరి 13న ముందుగా తమిళ్ వెర్షన్ విడుదల చేద్దామని అనుకున్నాము. అయితే తమిళ్ వెర్షన్ మాత్రమే అనుకున్నాం కానీ  తెలుగునాట  సంక్రాంతి పండగకు కి ప్రాముఖ్యత ఎలాంటిదో గుర్తించి ఇదే సరైన సమయమని తమిళ్ తో పాటు హిందీ, తెలుగు కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం.  అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే  గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్ధ్యంతం  ఉంటుంది.  తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది.  అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు.  ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.  ఓ  పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు.  హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది చిత్రం చూసిన తరువాత  ఆడియ‌న్స్‌కు  అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా,  అయన తన శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకున్నారు.    ఈ చిత్రం లో నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మడకొండ,  హ్యుమా ఖురేషి,  గుర్బాని జడ్జి, సుమిత్ర, యోగిబాబు, సెల్వ, జి ఎం సుందర్, అచ్యుత్ కుమార్, చైత్ర రెడ్డి, తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం : 
నిర్మాణ సంస్థలు: బే వ్యూ ప్రాజెక్ట్స్ L L P,  జీ స్టూడియోస్,
నిర్మాత: బోనీ కపూర్,
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్  : ఎచ్ వినోద్,
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా,  జిబ్రాన్,
సినిమాటోగ్రఫీ  : నీరవ్ షా,
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి,

Read in English

Spread the love
AD
AD

One thought on “Ajith’s Valimai will be released on January 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *