Friday, April 19, 2024
spot_img

Lahari Films and Chai Bisket Films Mem Famous First Single Ayyayyo is out now

లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘మేమ్ ఫేమస్’ ఫస్ట్ సింగిల్ అయ్యయ్యయ్యో పాట విడుదల  

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడం తో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిలేరియస్ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రైటర్ పద్మభూషణ్ కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన కళ్యాణ్ నాయక్ ఈ చిత్రానికి 9 పాటలను కంపోజ్ చేశారు. ఈ రోజు ఫస్ట్  సింగిల్ అయ్యయ్యయ్యో పాటని విడుదల చేశారు. మేమ్ ఫేమస్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. పాటలో కూడా పల్లెటూరి వైబ్ ఉంది. ప్లజంట్ ఆర్కెస్ట్రేషన్‌తో కంపోజిషన్ పూర్తిగా లోకల్ గా వుంది. అకాడమీ విజేత రాహుల్ సిప్లిగంజ్ తన స్ట్రైకింగ్ వాయిస్ తో మరింత ప్రత్యేకతని తీసుకువచ్చారు. ఈ అందమైన పాటకు కంపోజర్ కళ్యాణ్ నాయక్, నటి సార్య కలిసి లిరిక్స్ రాశారు.

పాట విజువల్‌గా మరింత ఆహ్లాదకరంగా ఉంది. ఈ పాట బావ (సుమంత్ ప్రభాస్) మరదలు (సార్య) మధ్య అందమైన కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తుంది. సుమంత్ తన మరదలిని ఎంతగా ఆరాధిస్తాడో వివరించే సన్నివేశం ఉంది. ఆమెకు మాటలే కరువవుతాయి. ప్లజంట్ కంపోజిషన్, అద్భుతమైన గానం, తెలంగాణ యాసలో అర్థవంతమైన సాహిత్యం, ఆకర్షణీయమైన విజువల్స్ తో ఈ పాట వైరల్ కానుంది.

శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్.

మేమ్ ఫేమస్ జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
సంగీతం: కళ్యాణ్ నాయక్
డీవోపీ: శ్యామ్ దూపాటి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఆర్ట్ : అరవింద్ మూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
పీఆర్వో: వంశీ-శేఖర్
క్రియేటివ్ ప్రోడ్యూసర్స్: ఉదయ్-మనోజ్

READ IN ENGLISH

Related Articles

- Advertisement -spot_img

Latest Articles