“2020 Goal Mall” “Surabhi 70mm”, a grand pre-release event that will entertain box office this week

ఈ వారం బాక్సాఫీస్ వినోదాన్ని పంచనున్న “2020 గోల్ మాల్” “సురభి 70 ఎంఎం”, గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ శుక్రవారం తెరపైకి రాబోతున్న సినిమాల్లో 2020 గోల్ మాల్,సురభి 70ఎంఎం (హిట్టు బొమ్మ) సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.జాన్ జిక్కి దర్శకత్వం వహించిన “2020 గోల్ మాల్” సినిమాలో మిట్టకంటి రామ్, విజయ్ శంకర్ , అక్షితా సోనవానె , మహి మల్హోత్రా, కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లు గా నటించగా దర్శకుడు గంగాధర వైకే అద్వైత తెరకెక్కించిన సురభి 70ఎంఎం (హిట్టు బొమ్మ) చిత్రంలో అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక తదితరులు నటించారు.. తాజాగా ఈ రెండు చిత్రాల ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని కలిపి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. దర్శకులు వీఎన్ ఆదిత్య, చంద్ర మహేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా 2020 గోల్ మాల్ దర్శకుడు జాన్ జిక్కి మాట్లాడుతూ…సినిమా నిర్మాణం కంటే ఆ చిత్రాన్ని విడుదల చేయడం ఎంంతో కష్టం. మా నిర్మాత సహకారం వల్లే మేము ఇక్కడిదాకా రాగలిగాం. ఒక కొత్త తరహా అనుభూతిని కలిగించేలా చిత్రాన్ని రూపొందించాం. అన్నారు.

హీరో మిట్టకంటి రామ్ మిట్టకంటి మాట్లాడుతూ..అమృతరామమ్ సినిమా కోసం ఇంటర్వ్యూ చేసిన ఒక పాత్రికేయుడు ద్వారా నాకు 2020 గోల్ మాల్ అవకాశం వచ్చింది. మీడియా లేకుంటే చిన్న చిత్రాలకు ఆధారమే లేదని నమ్ముతాను. ప్రతిభ ఉండి సినిమా మీద ఇష్టంతో కొత్తగా పరిశ్రమకు వస్తున్న వాళ్లను మనం కాపాడుకోవాలి. అన్నారు

సురభి 70 ఎం ఎం (హిట్టు బొమ్మ) దర్శకుడు గంగాధర వైకే అద్వైత
మాట్లాడుతూ..కథలను నమ్మి సినిమాలు చేసే నిర్మాత మాకు దొరకడం అదృష్టం. విలేజ్ లో సాగే మంచి ఎంటర్ టైనర్ గా సినిమా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

అతిథులుగా వచ్చిన దర్శకుడు చంద్ర మహేష్, వీఎన్ ఆదిత్య, బైలంపూడి బ్రహ్మానందరెడ్డి మరియు ఐ పి ఎస్ రమేష్ మస్తి పురం తదితరులు సినిమా టీమ్ కు బెస్ట్ విశెస్ తెలియజేశారు.

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *