11:34 Trailer Looks Promising With Intriguing Story, Gripping Narration And Top-notch Technicalities

థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న 1134 ట్రైలర్

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది 1134 మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందట. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.


2 నిమిషాల 24 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు. ATM దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్ చివరలో ‘అన్నీ నువ్వనుకునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ’ అంటూ వచ్చిన డైలాగ్.. ఈ సినిమాలో ఏదో కొత్త కోణం చూపించబోతున్నారని స్పష్టం చేస్తోంది.         


సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు.         
రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.


నటీనటులు: గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మడుపు
సాంకేతిక వర్గం:డైరెక్టర్: శరత్ చంద్ర తడిమేటిబ్యానర్: రాంధుని క్రియేషన్స్మ్యూజిక్: శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడిడీఓపీ: నజీబ్ షేక్, జితేందర్ తలకంటిడీఐ: గజ్జల రక్షిత్ కుమార్పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

READ IN ENGLISH

Spread the love
AD
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *